ఊటకుంటలను పరిశీలించిన వ్యవసాయశాఖ సెక్రెటరీ - wanaparthi
జల సంరక్షణలో భాగంగా కేంద్ర వ్యవసాయశాఖ సెక్రెటరీ డాలీ చక్రవర్తి వనపర్తి జిల్లాలో నిర్మించిన ఊట కుంటలు, ఫారం పండ్ల నిర్మాణాలను పరిశీలించారు. భూగర్భజల మట్టం పెరుగుదలకు ఊట కుంటలు ఉపయోగపడుతాయని అధికారులు ఆయనకు వివరించారు.
నీటి సంరక్షణలో భాగంగా కేంద్ర వ్యవసాయశాఖ సెక్రటరీ డాలీ చక్రవర్తి వనపర్తి జిల్లాలోని పెద్దమందడి మండలంలోని ప్రాంతాలను సందర్శించారు.
మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పనుల్లో భాగంగా గ్రామాల్లో ఊట కుంటలు నిర్మించారు. వర్షపు నీటిని ఒడిసి పట్టడంలో ఊట కుంటలు ఎంతగానో ఉపయోగపడతాయని అధికారులు వ్యవసాయ కార్యదర్శికి వివరించారు. మొదటగా పెద్దమందడి మండలంలోని మోజర్ల గ్రామంలో అటవీ శాఖ ఏర్పాటు చేసిన వన నర్సరీని ఆమె పరిశీలించారు. అనంతరం రైతు పొలంలో నిర్మిస్తున్న ఊట కుంట నిర్మాణాలను చూశారు. కుంట నిర్మాణ కొలతలను లోతు సంబంధించిన వివరాలను రికార్డులలో పరిశీలించారు. వ్యవసాయం చేసుకునేందుకు అనువుగా ఉంటుందని, నీటి ఇబ్బందులు ఉండవని అధికారులు తెలిపారు. జిల్లాలో మెుత్తం 600 ఫారం పండ్లను నిర్మించినట్లు డీఆర్డీవో కార్యదర్శికి చెప్పారు.