తెలంగాణ

telangana

ETV Bharat / state

'మా కూతుర్ని అత్తింటివారే చంపేశారు' - crime

తమ కూతురిని అత్తింటివారే చంపేసి... గుండెపోటుతో చనిపోయిందని నమ్మిస్తున్నారని తల్లిదండ్రులు పీఎస్​లో​ కేసు నమోదు చేసిన ఘటన వికారాబాద్​ జిల్లాలో చోటుచేసుకుంది. తల్లిదండ్రుల ఫిర్యాదుతో పోలీసులు విచారణ చేపట్టారు.

women suspected death in vikarabad district
'మా కూతుర్ని అత్తింటివారే చంపేశారు'

By

Published : Dec 1, 2019, 10:27 PM IST

వికారాబాద్​ జిల్లా ధారూర్​ మండలం నాగసముద్రంలో ఆఫ్రీన్​ బేగం అనే మహిళ మృతి చెందింది. పెళ్లయిన రెండేళ్లకే వివాహిత మృతి చెందడం పట్ల మృతురాలి కుటుంబ సభ్యులు అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. నాగసముద్రం గ్రామానికి చెందిన అఖిల్​కు, పుల్​మామిడి గ్రామానికి చెందిన ఆఫ్రీనాబేగంకు రెండేళ్ల క్రితం వివాహం జరిగింది. పెళ్లి జరిగిన నాటి నుంచి భర్త, అత్తమామలు, మరుదులు వేధించడం వల్లే తమ కూతురు చనిపోయిందని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. అఖిల్​ కుటుంబమంతా కలిసి చంపేసి... గుండెపోటుతో మృతి చెందిందని నమ్మించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఆఫ్రీనాబేగం తల్లిదండ్రుల ఫిర్యాదుతో వికారాబాద్​ డీఎస్పీ సంజీవరావ్​ కేసును దర్యాప్తు చేస్తున్నారు.

'మా కూతుర్ని అత్తింటివారే చంపేశారు'

ABOUT THE AUTHOR

...view details