వికారాబాద్ జిల్లా తాండూర్లో గణపతి మండపాలను నిర్వాహకులు అందంగా, ఆకర్షణీయంగా ఏర్పాటు చేశారు. రాత్రివేళ విద్యుత్ వెలుగులతో భక్తులను ఆకట్టుకుంటున్నాయి. ఒక్కో మండపంలో ఒక్కో విధంగా ఉయ్యాల గణపతి, పేపర్ గణపతి, నీటి, శివ , నెమలి , పర్యావరణహిత వినాయకులు ఇలా పలు రకాల వినాయక విగ్రహాలు దర్శనమిస్తున్నాయి. అన్నింటిలో వ్యవసాయక్షేత్రంలో కొలువైన విఘ్నేశ్వరుడు మరింత ఆకర్షణీయంగా ఉన్నాడు. మొదటి రోజు భక్తులు పెద్ద ఎత్తున స్వామివారిని దర్శించుకున్నారు. మండపాల వద్ద మహిళల నృత్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
తాండూరులో ఘనంగా చవితి వేడుకలు - తాండూర్లో
తాండూర్లో వినాయక ఉత్సవాలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. పట్టణంలో దాదాపు 500 గణేశ్ విగ్రహాలు ఏర్పాటు చేశారు.
వ్యవసాయ క్షేత్రంలో గణపతి
Last Updated : Sep 3, 2019, 1:42 PM IST