తెలంగాణ

telangana

ETV Bharat / state

పరిగిలో పర్యటించిన జిల్లా కలెక్టర్ - జిల్లా కలెక్టర్

వికారాబాద్​ జిల్లా పరిగి మున్సిపాలిటీలో కలెక్టర్ పౌసుమి బసు పర్యటించి.. ఆస్తుల నమోదును తనిఖీ చేశారు. మున్సిపాలిటీ పరిధిలో చేపట్టిన పలు అభివృద్ధి పనులను పరిశీలించారు. ఆస్తుల వివరాల నమోదును వీలైనంత  త్వరగా నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు.

Vikarabad Collector visits in parigi town
పరిగిలో పర్యటించిన జిల్లా కలెక్టర్

By

Published : Oct 17, 2020, 8:49 AM IST

వికారాబాద్​ జిల్లా పరిగి మున్సిపాలిటీలో జిల్లా కలెక్టర్​ పౌసుమి బసు పర్యటించారు. ఆస్తుల వివరాల నమోదును పరిశీలించిన ఆమె.. వీలైనంత త్వరగా ధరణి నమోదు ప్రక్రియ పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. పట్టణంలోని వ్యవసాయ మార్కెట్​ కమిటీ వెనుక భాగంలో ఏర్పాటు చేసిన పబ్లిక్​ టాయ్​లెట్స్​ను పరిశీలించారు. మూత్రశాలలు, ఆ చుట్టపక్కల ప్రాంతాలు పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు.

కూరగాయల మార్కెట్​లోని మాంసం దుకాణాలకు ప్రత్యేక షెడ్లు ఏర్పాటు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో పరిగి మున్సిపల్ చైర్మన్ ముకుంద అశోక్, మున్సిపల్ కమిషనర్ ప్రవీణ్ కుమార్, ఎమ్మార్వో, కౌన్సిలర్లు పాల్గొన్నారు.

ఇదీ చూడండి:24 గంటల్లో కరెంట్ సరఫరా జరగాలి: కేటీఆర్ ఆదేశం

ABOUT THE AUTHOR

...view details