పల్లెలు దేశానికి పట్టుకొమ్మల లాంటివని ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి పేర్కొన్నారు. సోమవారం వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గం దౌల్తాబాద్ మండలంలోని పలు గ్రామాల్లో రూ.40 లక్షల నిధులతో చేపట్టిన అభివృద్ధి పనులకు జడ్పీ ఛైర్పర్సన్ సునీత మహేందర్‌రెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు.
మార్పు అనేది గ్రామాల నుంచే మొదలవ్వాలని ఎమ్మెల్యే పేర్కొన్నారు. గ్రామాల్లో చాలామంది మరుగుదొడ్లు నిర్మించుకున్నా.. వాటిని వినియోగించుకోకుండా బహిరంగ మల విసర్జనలు చేస్తున్నారన్నారు. బహిరంగ మల విసర్జన చేయడం వల్ల పరిసరాలు అపరిశుభ్రంగా మారి అనారోగ్యాలకు గురవుతారని హెచ్చరించారు.