"ప్రతి ఒక్కరు మరుగుదొడ్లు కట్టుకోవాలి" - toilets
వికారాబాద్ జిల్లాలోని పర్సాపూర్ గ్రామంలో జిల్లా పాలనాధికారి ఆయేషా మహిళలకు మరుగుదొడ్లపై అవగాహన కల్పించారు. బహిరంగ మల విసర్జన చేస్తే అంటు వ్యాధులు వచ్చే అవకాశముందని తెలిపారు.
గ్రామంలో ప్రతి ఒక్కరూ ఇంటింటికి మరుగుదొడ్లు నిర్మించుకోవాలని వికారాబాద్ జిల్లా పాలనాధికారి మస్రత్ ఖానమ్ ఆయేషా తెలిపారు. కొడంగల్ మండలంలోని పర్సాపూర్ గ్రామంలో మహిళలకు మరుగుదొడ్లపై అవగాహన కల్పించారు. ముఖ్యంగా వర్షాకాలం కావడం వల్ల బహిరంగ మల విసర్జన చేస్తే అంటు వ్యాధులు వచ్చే అవకాశం ఉందని చెప్పారు. దీనివల్ల గ్రామంలో ఎంతోమంది అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉందని తెలిపారు. అనంతరం గ్రామంలోని పలు కాలనీలు పరిశీలించి స్వచ్ఛత గురించి మహిళలకు, గ్రామస్థులకు అవగాహన కల్పించారు.
TAGGED:
toilets