వికారాబాద్ కలెక్టరేట్లో ముప్పై రోజుల కార్యాచరణపై జడ్పీటీసీ, ఎంపీటీసీలకు అవగాహన సదస్సు నిర్వహించారు. జడ్పీ ఛైర్పర్సన్ సునీతారెడ్డి, ఎంపీ రంజిత్‌రెడ్డి, కలెక్టర్ అయేషా.. చేపట్టాల్సిన పనులపై దిశానిర్దేశం చేశారు. గ్రామాలన్నీ ఆదర్శంగా మారాలని సునీతారెడ్డి ఆకాంక్షించారు.
ఈనెల 6 నుంచి నెలరోజుల పాటు జరిగే కార్యక్రమంలో తొలిరోజు గ్రామసభ, రెండోరోజు కమిటీలు, కో ఆప్షన్ సభ్యులను ఎన్నుకోనున్నారని ఎంపీ తెలిపారు. నిధులు నేరుగా పంచాయతీలకే కేటాయించినందున గ్రామాల్లో సమూల మార్పులు వస్తాయన్నారు.