Revanth Reddy Speech at Congress Public Meeting in Vikarabad : తెలంగాణ దశ.. దిశ మార్చే సమయం వచ్చిందని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి (Revanth Reddy) అన్నారు. నీళ్లు జగన్‌రెడ్డి తీసుకుపోయారని, నిధులు కృష్ణారెడ్డి తీసుకుపోయారని ఆరోపించారు. రాష్ట్రంలో ఉద్యోగాలు భర్తీ చేయకుండా నిరుద్యోగుల ప్రాణాలు తీస్తున్నారని మండిపడ్డారు. ఉద్యోగ పరీక్షలు జరగలేదనే బెంగతో మొన్న యువతి ఆత్మహత్య చేసుకుందని.. అయినా మృతురాలిపై కేటీఆర్, పోలీసులు అభాండాలు వేశారని దుయ్యబట్టారు. వికారాబాద్‌లో నిర్వహించిన కాంగ్రెస్ బహిరంగ సభ వేదికగా ఆయన ఎన్నికల శంఖారావాన్ని పూరించారు.
Revanth Reddy Fires on BJP and BRS : 'వచ్చే ఎన్నికల్లో బీజేపీ, బీఆర్ఎస్లకు బుద్ది చెప్పి.. రాష్ట్రాన్ని, దేశాన్ని కాపాడుకోవాలి'
Revanth Reddy Comments on KCR : కేసీఆర్ హుస్నాబాద్ నుంచి ప్రచారం మొదలు పెడితే.. తాను వికారాబాద్ గడ్డపై నుంచి ప్రచారం మొదలు పెడుతున్నానని రేవంత్రెడ్డిపేర్కొన్నారు. 2023 ఎన్నికల సమరభేరి ఇక్కడి నుంచే మొదలైందని అన్నారు. వికారాబాద్ జిల్లాలో 5 అసెంబ్లీ స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని ప్రజలను కోరారు. ఈ జిల్లా కాంగ్రెస్ నేతలు ఎంతో కష్టపడి పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టు మంజూరు చేయించారని గుర్తు చేశారు. తెలంగాణ వచ్చి పదేళ్లు గడిచినా.. పాలమూరు- రంగారెడ్డి ప్రాజెక్టును కేసీఆర్ (KCR) ఎందుకు పూర్తి చేయలేదని రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు.
Revanth Reddy Counter to BRS Leaders : 'కేసీఆర్ సర్కారుకు ఇంకా 99 రోజులే మిగిలి ఉన్నాయి.. బీఆర్ఎస్ నేతలు విచక్షణ కోల్పోయి మాట్లాడుతున్నారు'
వికారాబాద్‌కు కృష్ణా జలాలు రాకపోవడానికి కారణం ఎవరని రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. వికారాబాద్ వరకు ఎంఎంటీఎస్ తెచ్చేందుకు జైపాల్‌రెడ్డి ఎంతో కృషి చేశారని గుర్తు చేశారు. రాజకీయాల్లో ఈ ప్రాంత ప్రజలకు తెలియని రౌడీయిజాన్ని కేసీఆర్ తీసుకువచ్చారని ఆరోపించారు. హస్తం గుర్తుపై ఓటు వేసి కాంగ్రెస్‌ను గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ క్రమంలోనే తెలంగాణ ప్రజలకు సోనియాగాంధీ ఆరు గ్యారెంటీలు ఇచ్చారని తెలిపారు. డిసెంబర్ 9న కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరుతుందని ధీమా వ్యక్తం చేశారు. అదే రోజు ఉదయం 10:30 గంటలకు ఆరు గ్యారెంటీలపై.. పార్టీ తొలి సంతకమని రేవంత్‌రెడ్డి అన్నారు.
"తెలంగాణ వచ్చి పదేళ్లు గడిచినా రైతుల కల నెరవేరలేదు.ఈ ప్రాంతానికి గోదావరి జలాలు రాకపోవడానికి బీఆర్ఎస్ కారణం కాదా?. ఉద్యోగాలు భర్తీ చేయకుండా నిరుద్యోగుల ప్రాణాలు తీస్తున్నారు. ఉద్యోగ పరీక్షలు జరగలేదనే బెంగతో మొన్న యువతి ఆత్మహత్య చేసుకుంది. ఆత్మహత్య చేసుకున్న యువతిపై కేటీఆర్, పోలీసులు అభాండాలు వేశారు. తెలంగాణ ప్రజలకు సోనియాగాంధీ ఆరు గ్యారంటీలు ఇచ్చారు. డిసెంబర్ 9న కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరుతుంది. డిసెంబర్ 9న ఉదయం 10:30 గంటలకు ఆరు గ్యారంటీలపై కాంగ్రెస్ తొలి సంతకం."- రేవంత్‌రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు
Revanth Reddy Speech at Congress Public Meeting in Vikarabad తెలంగాణ దశ దిశ మార్చే సమయం వచ్చింది Revanth Reddy Reaction on Jamili Elections : జమిలి ఎన్నికల వెనక పెద్ద కుట్ర.. ఇది దేశ ప్రజాస్వామ్యానికి పెను ప్రమాదం: రేవంత్‌రెడ్డి
Revanth Reddy on BRS Candidates List : 'కేసీఆర్ స్వరంలో ఓటమి భయం స్పష్టంగా కనిపించింది'