తెలంగాణ

telangana

ETV Bharat / state

వికారాబాద్​ రైల్వేస్టేషన్లో సౌకర్యాలు పరిశీలించిన రైల్వేజీఎం

వికారాబాద్​ రైల్వే స్టేషన్​ను దక్షిణ మధ్య రైల్వే జీఎం గజానన మాల్యా పరిశీలించారు. వికారాబాద్​ స్టేషన్​లోని పలు సమస్యలపై స్థానిక ఎమ్మెల్యే ఆనంద్​ రైల్వే జీఎంను కలిసి వినతి పత్రం అందించారు. తమ డిమాండ్​లు పరిష్కరిస్తామని హామీ ఇచ్చినట్లు ఎమ్మెల్యే తెలిపారు.

By

Published : May 14, 2019, 6:11 AM IST

Updated : May 14, 2019, 7:20 AM IST

railway-gm-1

వికారాబాద్​ రైల్వే స్టేషన్లో సౌకర్యాలను దక్షిణ మధ్య రైల్వే జీఎం గజానన మాల్య పరిశీలించారు. సికింద్రాబాద్​ నుంచి ప్రత్యేక రైళ్లో ఆయన వికారాబాద్​ వచ్చారు. రైల్వేస్టేషన్​, ఆస్పత్రి​, కమ్యునిటీహాల్​ను పరిశీలించారు. రైల్వే జీఎంను స్థానిక ఎమ్మెల్యే ఆనంద్​ కలిసారు. స్టేషన్​ పరిసరాల్లో ఫ్లైఓవర్​ వంతెనలు నిర్మించాలని విన్నవించారు. కోణార్క్​, గరీబ్​రథ్​ రైళ్లు ఆపాలని, ఎంఎంటీస్​ సౌకర్యాన్ని వికారాబాద్​ వరకూ పొడిగించాలని కోరుతూ వినతిపత్రం సమర్పించారు. స్థానిక ప్రాంతాలకు చెందిన రైతులు తమ పొలాల్లోకి వెళ్లడానికి దారి లేదని కోరగా అక్కడ వంతెన ఎత్తు పెంచి దారి కల్పిస్తామని హామీ ఇచ్చారని ఎమ్మెల్యే తెలిపారు.

వికారాబాద్​ రైల్వేస్టేషన్లో సౌకర్యాలు పరిశీలించిన రైల్వేజీఎం
Last Updated : May 14, 2019, 7:20 AM IST

ABOUT THE AUTHOR

...view details