వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో పోలీసులు, వ్యవసాయ శాఖ అధికారులు సంయుక్తంగా ఎరువుల దుకాణాల్లో తనిఖీలు నిర్వహించారు. తాండూరు పోలీస్ సబ్ డివిజన్లోని అన్ని పోలీస్ స్టేషన్ల ఎస్సైలు, గ్రామీణ పట్టణ సీఐల ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టారు.
పట్టణంలోని మొత్తం 22 ఎరువుల దుకాణాల్లో పోలీసులు, వ్యవసాయ అధికారులు తనిఖీలు చేశారు. దుకాణాలతోపాటు గోదాంలను సైతం అధికారులు పరిశీచలించారు. ఎరువుల విక్రయాలకు సంబంధించిన రశీదులు, ధరలు, దుకాణాల లైసెన్సులు, నకిలీ విత్తనాలు, కాలం చెల్లిన వాటిపై ఆరా తీశారు.