తెలంగాణ

telangana

ETV Bharat / state

తాగునీటి కోసం ఖాళీ బిందెలతో నిరసన - నీటి కోసం పరిగి కాలనీ వాసుల వెతలు

తమకు మూడు నెలలుగా తాగునీరు రావడం లేదంటూ వికారాబాద్​ జిల్లా పరిగిలోని కాలనీ వాసులు ఆందోళన చేపట్టారు. అధికారులు స్పందించి తమ సమస్యను తీర్చాలని వేడుకుంటున్నారు.

నీటి కోసం ధర్నా

By

Published : Jun 11, 2019, 4:45 PM IST

తాగునీటి కోసం పరిగి కాలనీ వాసుల ధర్నా

వికారాబాద్​ జిల్లా పరిగిలోని బీసీ, ఖాన్​ కాలనీ వాసులు తాగునీటి కోసం ఆందోళన బాట పట్టారు. స్థానికంగా ఉన్న మినరల్​ వాటర్​ ప్లాంట్​ నుంచి వచ్చే వృథా నీటిని వాడుకోవాల్సిన దుస్థితి ఏర్పడిందని ప్రధాన రహదారిపై ఖాళీ బిందెలతో ధర్నాకు దిగారు. పోలీసులు అదుపు చేయడానికి ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకపోయింది. మంచినీటి కోసం వేసిన బోర్లు ఎండిపోవడం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని... అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి నీటి సమస్యను తీర్చాలని డిమాండ్​ చేశారు. ఇంత జరుగుతున్నా మున్సిపల్​ అధికారులెవరూ లేకపోవడం గమనార్హం.

ABOUT THE AUTHOR

...view details