తెలంగాణ

telangana

ETV Bharat / state

ఫొటో, వీడియోగ్రఫీపై సోనీ కంపెనీ ఉచిత శిక్షణ

ఫొటో అండ్ వీడియోగ్రఫీపై గ్రామస్థాయిలో జీవనోపాధి పొందుతున్న పలువురికి సోనీ కంపెనీ ఉచితంగా శిక్షణ ఇచ్చింది.

ఫొటో, వీడియోగ్రఫీపై సోనీ కంపెనీ ఉచిత శిక్షణ

By

Published : Aug 25, 2019, 8:03 AM IST

వికారాబాద్​ జిల్లా కుల్కచర్ల మండల కేంద్రంలో ఫొటో అండ్ వీడియో గ్రాఫర్స్​కు సోనీ కంపెనీ ఉచితంగా ఒకరోజు శిక్షణా శిబిరాన్ని నిర్వహించింది. సోనీ కంపెనీ నూతనంగా మార్కెట్లోకి తెచ్చిన కెమెరాలను వాటి విధి విధానాలను ఫొటోగ్రాఫర్స్​కు వివరించారు. గ్రామీణ ప్రాంతంలో ఉండే ఫొటో అండ్ వీడియోగ్రాఫర్స్​కు నైపుణ్యత ఎంతో అవసరమని సోనీ సేల్స్ మేనేజర్ నవీన్ పేర్కొన్నారు. గ్రామాల్లో ఉండే ఫొటోగ్రాఫర్స్​కు వీడియోగ్రాఫర్స్​కు శిక్షణ ఇవ్వడం అభినందనీయమని తెలంగాణ ఫొటో అండ్ వీడియో గ్రాఫర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు ఎస్. వెంకట్ అన్నారు.

ఫొటో, వీడియోగ్రఫీపై సోనీ కంపెనీ ఉచిత శిక్షణ

ABOUT THE AUTHOR

...view details