ఈటీవీ భారత్‌లో గ్రామీణ విద్యార్థులకు స్మార్ట్ ఫోన్లు, టీవీలు లేకపోగా డిజిటల్ విద్యకు దూరమవుతున్నారని గత వారం కథనం ప్రచురితమైంది. దీనికి స్పందించిన స్థానిక ఎమ్మెల్యే మహేష్‌రెడ్డి.. అప్పుడే విద్యార్థులకు మహబూబ్‌నగర్ జిల్లా పగిడాల గ్రామంలో చరవాణీలు అందజేశారు. అది చూసిన ఎంపీ రంజిత్‌రెడ్డి.. ప్రతి గ్రామానికి తన సొంత డబ్బులతో ఇస్తానని హామీ ఇచ్చారు. అందులో భాగంగా వికారాబాద్ జిల్లా పరిగి నియోజకవర్గంలోని పూడూరు మండలంలో 31 గ్రామాలకు, దోమ మండలంలోని 43 గ్రామాలకు ఎమ్మెల్యే మహేష్ రెడ్డితో కలిసి టీవీలను పంపిణీ చేశారు.
ఈటీవీ భారత్ కథనానికి స్పందన.. ఆన్లైన్ విద్యకోసం ఎంపీ సాయం
గ్రామీణ విద్యార్థులకు టీవీలు, ఫోన్లు లేక డిజిటల్ విద్యకు దూరమవుతున్నారంటూ ఈటీవీ భారత్‌లో వచ్చిన కథనానికి స్పందనగా.. వికారాబాద్ జిల్లా పూడూరు, దోమ మండలాల్లో ఎమ్మెల్యే మహేష్ రెడ్డితో కలిసి ఎంపీ రంజిత్‌రెడ్డి.. టీవీలను పంపిణీ చేశారు.
ప్రతి విద్యార్థి చదువుకునేలా అధికారులు చర్యలు చేపట్టాలని ఎంపీ రంజిత్‌రెడ్డి, ఎమ్మెల్యే మహేష్‌రెడ్డి తెలిపారు. ఇంట్లో టీవీ లేని కారణంగా విద్యార్థులు చదువుకు దూరం కాకూడదనే ఉద్దేశంతో టీవీలను అందజేయనున్నట్లు వెల్లడించారు. కరోనా కారణంగా విద్యార్థులెవరూ చదువులు ఆపేయకూడదని.. రాష్ట్ర ప్రభుత్వం టీశాట్ ఛానెళ్ల ద్వారా డిజిటల్ విద్యను నేర్పిస్తున్నారంటూ రంజిత్‌రెడ్డి అన్నారు. ఐతే అందులో చాలా మంది వద్ద టీవీలు లేనందున.. వారి కోసం ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని ఎంపీ వెల్లడించారు.
ఇదీ చదవండిః ఆన్లైన్ విద్యతో.. గ్రామీణ ఇంటర్ విద్యార్థుల అవస్థలు