తెలంగాణ

telangana

By

Published : Aug 5, 2019, 3:30 PM IST

ETV Bharat / state

తాండూరులో ఘనంగా నాగుల పంచమి వేడుక

తాండూరులో నాగుల పంచమి పురస్కరించుకుని.. ఆలయాలకు భక్తులు పోటెత్తారు. తెల్లవారుజామునే ఆలయాలకు చేరుకున్న మహిళలు పుట్టచుట్టూ ప్రదక్షిణలు చేశారు.

తాండూరులో ఘనంగా నాగుల పంచమి వేడుకలు


వికారాబాద్ జిల్లా తాండూరులో నాగుల పంచమి పండుగను మహిళలు భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. పుట్టలో పాలు పోసి పూజలు నిర్వహించారు. పట్టణంలోని సాయిపూర్​, మల్రెడ్డిపల్లి, పాత తాండూరు ప్రాంతాల్లో మహిళలు ఉదయం నుంచే ఆలయాలకు చేరుకుని పుట్టచుట్టూ ప్రదక్షిణలు చేశారు. అనంతరం నైవేద్యం సమర్పించారు. తమ పిల్లల్ని, ఇంటిల్లిపాదిని చల్లగా చూడాలని నాగదేవతను వేడుకున్నారు.

తాండూరులో ఘనంగా నాగుల పంచమి వేడుక

ABOUT THE AUTHOR

...view details