తెలంగాణ

telangana

ETV Bharat / state

చెత్త తొలగించకపోవడం వల్లే చనిపోయాడని ఆందోళన

మున్సిపల్ సిబ్బంది నాలాలు, చెత్త తొలగించకపోవడం వల్లే డెంగీ బారినపడి యువకుడు చనిపోయాడని వికారాబాద్ జిల్లా కేంద్రంలో ఆందోళన చేశారు. చెత్త తొలగిస్తామన్న కమిషనర్ హామీతో ఆందోళన విరమించారు.

vkb-andolana

By

Published : Sep 20, 2019, 2:29 PM IST

వికారాబాద్ జిల్లా కేంద్రంలో రాజీవ్​నగర్​ కాలనీ వాసులు రోడ్డుపై బైఠాయించారు. గురువారం రాత్రి జహీర్ ఖాన్ అనే యువకుడు డెంగీతో మరణించాడు. మున్సిపల్ సిబ్బంది నాలాలు, చెత్త తొలగించకపోవడం వల్లే డెంగీ బారినపడి చనిపోయాడని ఆరోపిస్తూ నిరసన తెలిపారు. మున్సిపల్ సిబ్బందికి ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆందోళనతో కిలోమీటర్ మేర వాహనాలు స్తంభించాయి. మున్సిపల్ సిబ్బంది వచ్చి చెత్తను తొలగించారు. రోజూ తొలగిస్తామని కమిషనర్​ హామీ ఇచ్చిన తరువాత ఆందోళన విరమించారు.

చెత్త తొలగించకపోవడం వల్లే డెంగీతో వ్యక్తి చనిపోయాడని ఆందోళన

ABOUT THE AUTHOR

...view details