తెలంగాణ

telangana

ETV Bharat / state

అన్నదాతల ఆందోళన.. భారీగా నిలిచిన వాహనాలు - వికారాబాద్ జిల్లా వార్తలు

వరిధాన్యం కొనుగోళ్లు వెంటనే చేపట్టాలంటూ రైతన్నలు పెద్దఎత్తున ఆందోళన నిర్వహించారు. దీంతో వికారాబాద్ జిల్లా పరిగి వద్ద హైదరాబాద్​- బీజాపూర్ రహదారిపై భారీగా ట్రాఫిక్ నిలిచిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు రైతులను నచ్చజెప్పే ప్రయత్నం చేశారు.

farmers strike at pargi
వరిధాన్యం కొనుగోళ్లు వెంటనే చేపట్టాలంటూ రైతన్నల ఆందోళన

By

Published : Jun 6, 2021, 4:29 PM IST

వికారాబాద్ జిల్లా పరిగిలో అన్నదాతలు ఆందోళన బాట పట్టారు. వారం రోజులవుతున్న ధాన్యం కొనుగోళ్లు చేయడం లేదంటూ రహదారిని దిగ్బంధించారు. దీంతో హైదరాబాద్​- బీజాపూర్ జాతీయ రహదారిపై పెద్దఎత్తున ట్రాఫిక్ స్తంభించింది. ఓ వైపు వరిధాన్యం వాహనాలు బారులు తీరాయి. అటు వైపుగా వస్తున్న కొడంగల్ ఎమ్మెల్యే నరేందర్​ రెడ్డి సముదాయించినా రైతులు వినలేదు. తమకు స్పష్టమైన హామీ ఇచ్చేవరకు కదిలేది లేదని రైతులు భీష్మించుకుని కూర్చున్నారు.

గ్రామాల్లో ఉన్న కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తీసుకోకుండా రైతులను నేరుగా మిల్లు దగ్గరకు పంపించడంతో ఈ సమస్య తలెత్తింది. రైస్ మిల్లర్లు ధాన్యం కొనుగోల్లు ఆపేశామని బోర్డులు పెట్టడంతో రైతుల్లో గందరగోళానికి దారితీసింది. వారం రోజులుగా ధాన్యంతో రోడ్లపైనే పడిగాపులు కాస్తున్నామని రైతులు వాపోయారు.

తేమశాతం పేరుతో తరుగు తీసేస్తున్నారు

తేమ శాతం, తాలు అధికంగా ఉందని సంచికి నాలుగు కిలోల మేర తరుగు తీస్తు ఇబ్బందులకు గురి చేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత వారం రోజులుగా కిరాయి వాహనాల్లో ధాన్యం తెచ్చి అవస్థలు పడుతున్నామని రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే తమ ధాన్యం కొనుగోలు చేయాలని వారు డిమాండ్ చేశారు. పోలీసులు వచ్చి రైతులను సముదాయించే ప్రయత్నం చేశారు. మిల్లర్లను పిలిచి మాట్లాడారు.

ఇదీ చూడండి:CM KCR: ఈ నెల 9న డయాగ్నోస్టిక్‌ కేంద్రాల ప్రారంభం

ABOUT THE AUTHOR

...view details