తెలంగాణ

telangana

ETV Bharat / state

బాత్​రూంలో కరోనా బాధితుడు క్వారంటైన్.. ఏం జరిగిందంటే!

రోజురోజుకు విజృంభిస్తున్న కరోనా.. ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. ఒకే గదిలో ఉంటున్న కుటుంబంలో ఎవరికైనా కరోనా సోకితే.. ఐసోలేషన్​లో ఉండటం వీలుకావడం లేదు. అలా అని ఆస్పత్రికి పోయే పరిస్థితీ లేదు. ఇలాంటి సమస్య వచ్చిన ఓ వ్యక్తి తన ద్వారా కుటుంబానికి వైరస్ సోకకూడదని మూడ్రోజుల పాటు బాత్​రూంలో క్వారంటైన్​లో ఉన్నాడు.

bathroom quarantine, quarantine in bathroom
బాత్​రూంలో క్వారంటైన్, వికారాబాద్​ జిల్లాలో క్వారంటైన్

By

Published : May 16, 2021, 10:07 AM IST

Updated : May 16, 2021, 11:09 AM IST

వికారాబాద్ జిల్లా ధరూర్ మండలం మైలారం గ్రామానికి చెందిన అశోక్.. అదే గ్రామంలో పారిశుద్ధ్య కార్మికుడిగా విధులు నిర్వహిస్తున్నాడు. కరోనా లక్షణాలు కనిపించడం వల్ల కొవిడ్ టెస్ట్​ చేయించుకున్నాడు. పాజిటివ్​గా నిర్ధరణ అయింది. తన ద్వారా కుటుంబానికి వైరస్ సోకకూడదని భావించిన అశోక్ హోం ఐసోలేషన్​లో ఉండాలనుకున్నాడు.

బాత్​రూంలో కరోనా బాధితుడు క్వారంటైన్

కానీ.. తన కుటుంబమంతా ఒకే గదిలో నివసిస్తుండటం వల్ల హోంక్వారంటైన్ వీలుపడలేదు. అలా అని ఆస్పత్రికి పోయే స్థోమత లేదు. తన వల్ల కుటుంబానికి ఏం కాకూడదని తలచిన అశోక్ గత్యంతరం లేక మూడ్రోజులుగా బాత్​రూంలోనే క్వారంటైన్ అయ్యాడు. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న జిల్లా కలెక్టర్​ బాధితుడిని ఐసోలేషన్​ సెంటర్​కు తరలించారు.

Last Updated : May 16, 2021, 11:09 AM IST

ABOUT THE AUTHOR

...view details