తెలంగాణ

telangana

ETV Bharat / state

లంచం తీసుకుంటూ రెడ్​హ్యాండెడ్​గా పట్టుబడిన వీఆర్వో

భూమిని ఆన్​లైన్​లో నమోదు చేయడానికి నాలుగువేల లంచం డిమాండ్​ చేసిన వీఆర్వోను ఏసీబీ అధికారులు పట్టుకున్నారు.  వికారాబాద్​ జిల్లా చిట్టిగిద్ద వద్ద వ్యవసాయ క్షేత్రంలో లంచం తీసుకుంటున్న అధికారి రెడ్​హ్యాండెడ్​గా దొరికిపోయాడు.

లంచం తీసుకుంటూ రెడ్​హ్యాండెడ్​గా పట్టుబడిన వీఆర్వో

By

Published : Nov 19, 2019, 9:23 PM IST

వికారాబాద్​ జిల్లా నవాబుపేట మండలం కొజ్జ వనంపల్లికి చెందిన దావీదుకు వారసత్వంగా 3.29 ఎకరాల భూమి వారసత్వంగా సంక్రమించింది. నాలుగు ఏళ్లు తహసీల్దార్​ కార్యాలయం చుట్టూ తిరిగినా తన పేరుపైనా పట్టా మార్పిడి కాలేదు. గత సంవత్సరం ప్రొసీడింగ్​ ఇచ్చినా ఆన్​లైన్​లో నమోదు కాలేదు. ఆన్​లైన్​లో నమోదు చేయడానికి దావీదు కుమారుడు సాయికుమార్​ను వీఆర్వో తలారి రాములు 5 వేలు డిమాండ్​ చేయగా... అతను 4 వేలు ఇవ్వడానికి అంగీకరించాడు.
ఈ విషయంపై సాయికుమార్ ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేశాడు. వీఆర్వో రాములు సాయికుమార్​ను తన స్వగ్రామం చిట్టిగిద్దలోని తన వ్యవసాయ పొలంకు వచ్చి డబ్బులు ఇవ్వాలని కోరాడు. పొలంలో డబ్బులు ఇస్తుండగా ఏసీబీ అధికారులు రెడ్​హ్యాండెడ్​గా పట్టుకున్నారు. అనంతరం తహసీల్దార్​ కార్యాలయానికి తరలించిన అధికారులు విచారించి కేసు నమోదు చేశారు.

లంచం తీసుకుంటూ రెడ్​హ్యాండెడ్​గా పట్టుబడిన వీఆర్వో

ABOUT THE AUTHOR

...view details