వికారాబాద్ జిల్లా పరిగి మున్సిపాలిటీ పరిధిలోని టీచర్స్ కాలనీలో నివాసం ఉంటున్న మరియా దాస్ కరోనా వేళ ఓ ఆసక్తికర నిర్ణయం తీసుకున్నారు. తన ఇంట్లోకి కొత్తవారికి ప్రవేశం లేదంటూ గేటు ముందు బోర్డు పెట్టారు. తాము ఎవరి ఇంటికి వెళ్లకూడదని... ఎవరినీ తమ ఇంట్లోకి రానివ్వకూడదని నిర్ణయించుకున్నట్లు వివరించారు. తమ ఇంట్లో చాలా మంది అద్దెకు ఉంటారని... వారిలో పిల్లలూ ఉన్నందున బోర్డు పెట్టినట్లు పేర్కొన్నారు.
'దయచేసి రావొద్దు.. కొత్త వారికి ప్రవేశం లేదు'
పరిగి మున్సిపాలిటీలోని టీచర్స్ కాలనీలో ఓ వ్యక్తి ఆసక్తికర నిర్ణయం తీసుకున్నారు. కరోనా వేళ తమ ఇంటికి ఎవరూ రాకూడదని బోర్డు పెట్టారు. తమ ఇంట్లో పిల్లలు ఉన్నారని.. వైరస్ విజృంభణ రోజురోజుకూ అధికమవుతున్నందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు.
నో ఎంట్రీ బోర్డు, ఇంట్లోకి రావొద్దంటూ బోర్డు
కొందరు ఎంత చెప్పినా మాస్కులు ధరించకుండా, భౌతిక దూరం పాటించకుండా రోడ్లపై తిరుగుతున్నారని అన్నారు. మహమ్మారితో మృతి చెందుతున్న వారి సంఖ్య పెరుగుతోందని అన్నారు.
ఇదీ చదవండి:ఒకప్పుడు రాజసం... ఇప్పుడు మహాప్రస్థానం