తెలంగాణ

telangana

ETV Bharat / state

అనుమానాస్పద స్థితిలో బాలిక మృతి - DSP Sanjeev

అనుమానాస్పద స్థితిలో ఓ బాలిక మృతి చెందిన ఘటన వికారాబాద్ జిల్లా జాంబపూరం తండాలో చోటుచేసుకుంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

A Girl Suspected Death
బాలిక మృతి

By

Published : Feb 13, 2020, 8:01 PM IST

వికారాబాద్ జిల్లా జాంబపూరం తండాలో రేణుక(14) అనే బాలిక అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. బాలిక మృతి పట్ల బంధువులు, గ్రామస్థులు పలు అనుమానాలు వ్యక్తం చేశారు.

నవాబ్‌పేట్​లో కస్తూరిబా పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్న రేణుకను... తండ్రి రవి నిన్న పాఠశాల నుంచి తీసుకెళ్లాడు. సంగారెడ్డి జిల్లా సదాశివపేట్ మండలం ఆత్మకూరుకు తీసుకెళ్లగా అక్కడే అనారోగ్యంతో మృతి చెందినట్లు రవి చెప్పాడు.

రేణుక రవి మొదటి భార్య కూతురు. అతనిపై మొదటి భార్యను హత్య చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించామని డీఎస్పీ సంజీవరావు తెలిపారు.

బాలిక మృతి

ఇవీ చూడండి:ముక్తేశ్వర స్వామికి సీఎం కేసీఆర్‌ ప్రత్యేక పూజలు

ABOUT THE AUTHOR

...view details