తెలంగాణ

telangana

ETV Bharat / state

బ్యాడ్మింటన్‌ శిక్షణ వేదికకు గోపీచంద్‌ భూమిపూజ - pullela gopichand badminton academy

గచ్చిబౌలిలో అంతర్జాతీయ బ్యాడ్మింటన్‌ శిక్షణ వేదిక నిర్మాణానికి గోపీచంద్‌ భూమిపూజ చేశారు. ఈ కార్యక్రమానికి గవర్నర్‌ నరసింహన్ దంపతులు, మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ హాజరయ్యారు.

pullela gopichand

By

Published : Jun 26, 2019, 10:52 AM IST

Updated : Jun 26, 2019, 1:13 PM IST

బ్యాడ్మింటన్‌ శిక్షణ వేదికకు గోపీచంద్‌ భూమిపూజ

హైదరాబాద్‌ గచ్చిబౌలిలోని గోపీచంద్‌ బ్యాడ్మింటన్‌ అకాడమీ వద్ద అంతర్జాతీయ బ్యాడ్మింటన్‌ శిక్షణ వేదిక నిర్మాణానికి గోపీచంద్‌ భూమిపూజ చేశారు. కొటక్‌ మహీంద్రబ్యాంకు, పుల్లెల గోపీచంద్‌ బ్యాడ్మింటన్‌ ఫౌండేషన్‌ సంయుక్తంగా నిర్మాణం చేపడుతోంది. ఈ కార్యక్రమానికి గవర్నర్‌ నరసింహన్ దంపతులు, మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ హాజరయ్యారు.

దేశంలో ఎక్కడా లేనివిధంగా

దేశంలో ఎక్కడా లేనివిధంగా అంతర్జాతీయస్థాయిలో అకాడమీని గోపీచంద్ స్థాపించారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. వివిధ రాష్ట్రాలు, దేశాల నుంచి ఇక్కడ శిక్షణ పొందుతున్నారని తెలిపారు. క్రీడలు, క్రీడాకారులను సీఎం కేసీఆర్ ప్రోత్సహిస్తున్నారని పేర్కొన్నారు. గ్రామీణ క్రీడాకారులను కూడా ప్రోత్సహించాలని సూచించారు. అంతర్జాతీయ వేదిక అందుబాటులోకి వస్తే క్రీడాకారులకు మరింత మెరుగైన శిక్షణ అందుతుందని గోపీచంద్‌ అన్నారు. 6 ఏసీ కోర్టులు, అథ్లెటిక్‌ కోర్ట్, స్విమ్మింగ్ పూల్‌లు అందుబాటులోకి రానున్నాయని తెలిపారు.

ఇదీ చూడండి: కాళేశ్వరం ఓకే.. మరి పాలమూరు- రంగారెడ్డి పరిస్థితి!

Last Updated : Jun 26, 2019, 1:13 PM IST

ABOUT THE AUTHOR

...view details