ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో లాక్డౌన్ పకడ్బందీగా కొనసాగుతోంది. నిజామాబాద్, కామారెడ్డి జిల్లా కేంద్రాల్లో పోలీసులు కఠినంగా నిబంధనలు అమలు చేస్తున్నారు. డీజీపీ మహేందర్ రెడ్డి ఆదేశాల మేరకు ఉదయం పది తర్వాత ప్రజలెవరూ బయటకు రాకుండా చూస్తున్నారు. ఎక్కడికక్కడ బారికేడ్లు ఏర్పాటు చేశారు.
నిబంధనలు ఉల్లంఘిస్తే వాహనాలు సీజ్.. ఆపై కేసులు - ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పటిష్ఠంగా లాక్డౌన్
నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లో లాక్డౌన్ పటిష్ఠంగా అమలవుతోంది. లాక్డౌన్ మినహాయింపు అనంతరం ప్రజలెవరూ బయటకు రాకుండా పోలీసులు నియంత్రిస్తున్నారు.
నిజామాబాద్, కామారెడ్డిలో పటిష్ఠంగా లాక్డౌన్
ప్రధాన కూడళ్లు, కాలనీల్లో లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘిచిన వారి వాహనాలను పోలీసులు సీజ్ చేసి కేసులు నమోదు చేస్తున్నారు. పహారా పెంచి వాహనాల రాకపోకలు నియంత్రిస్తున్నారు.
ఇదీ చదవండి:యూపీఎస్సీ తరహాలో ఉద్యోగాల క్యాలెండర్: జనార్దన్‌రెడ్డి