శాసనమండలిలో మరో స్థానం ఖాళీ అయింది. నామినేటెడ్ కోటాలో ప్రాతినిధ్యం వహిస్తోన్న శ్రీనివాసరెడ్డి పదవీకాలం నేటితో పూర్తయింది. పదవీకాలం ముగిసిన నేపథ్యంలో శ్రీనివాసరెడ్డికి ప్రొటెం ఛైర్మన్ భూపాల్ రెడ్డి, మంత్రి మహమూద్ అలీ, సహచర ఎమ్మెల్సీలు, కార్యదర్శులు ఘనంగా వీడ్కోలు పలికారు.
Telangana Mlc: శాసనమండలిలో మరో స్థానం ఖాళీ
గవర్నర్ కోటాలో ఎంపికైన ఎమ్మెల్సీ శ్రీనివాస్‌రెడ్డి పదవీకాలం నేటితో ముగిసింది. ఇప్పటికే ఆరు స్థానాలు ఖాళీ కాగా.. శ్రీనివాసరెడ్డి పదవీ విరమణతో ఖాళీల సంఖ్య ఏడుకు చేరుకుంది. మొత్తం 40 ఎమ్మెల్సీ స్థానాలు ఉండగా.. ప్రస్తుతం 33 మంది సభ్యులు పదవుల్లో కొనసాగుతున్నారు.
Legislature
అయితే ఇప్పటికే ఆరు స్థానాలు ఖాళీ కాగా.. శ్రీనివాసరెడ్డి పదవీ విరమణతో ఖాళీల సంఖ్య ఏడుకు చేరుకుంది. రాష్ట్ర శాసనమండలిలో మొత్తం 40 ఎమ్మెల్సీ స్థానాలు ఉండగా.. ప్రస్తుతం 33 మంది సభ్యులు పదవుల్లో కొనసాగుతున్నారు.
ఇదీ చదవండి:Highcourt: కోర్టు ధిక్కరణ చర్యలు ఎందుకు చేపట్టకూడదో చెప్పండి?