ఎస్టీ జాబితా నుంచి లంబాడీలను తొలగించాలనే అంశం కోర్టు తేల్చాల్సి ఉందన్నారు ఆదిలాబాద్ తెరాస లోక్సభ అభ్యర్థి గోడం నగేష్. ఆదివాసీ-లంబాడీల రిజర్వేషన్ అంశం వెనక సీట్ల రాజకీయం దాగి ఉందనీ, మొన్నటి శాసనసభ ఎన్నికల్లో అది నిరూపితమైందని వ్యాఖ్యానించారు. తెరాసలో అసమ్మతి సహజమేనని, దానిని బూతద్దంలో చూడాల్సిన అవసరం లేదన్నారు. ఎన్నికల అనంతరం జిల్లాకు తప్పకుండా గిరిజన విశ్వవిద్యాలయం తీసుకొస్తానని గోడం నగేష్ హామీ ఇచ్చారు.
'ఆదివాసీ ఉద్యమం వెనక సీట్ల రాజకీయం ఉంది' - ఆదిలాబాద్ ఎంపీ గోడం నగేష్
ఆదివాసీ ఉద్యమం వెనక స్వార్థమైన సీట్ల రాజకీయం ఉందన్నారు ఆదిలాబాద్ తెరాస లోక్సభ అభ్యర్థి గోడం నగేష్. కాంగ్రెస్, భాజపాలు తనకు పోటీ కాదన్నారు. తన విజయం ఎప్పుడో ఖాయమైపోయిందని నగేష్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.
'ఆదివాసీ ఉద్యమం వెనక సీట్ల రాజకీయం ఉంది'