తెలంగాణ

telangana

ETV Bharat / state

ఓటు వినియోగంపై ములుగులో 2కె రన్​

ప్రజాస్వామ్యంలో ఓటు చాలా విలువైనది. ఐదేళ్లు మనల్ని పాలించే నాయకున్ని ఎన్నుకునే అస్త్రం. ప్రతి ఒక్కరూ దానిని ఉపయోగించుకునేలా అధికారులు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. తాజాగా ములుగు జిల్లాలో ఓటరు అవగాహనపై కలెక్టర్​ 2కె రన్​ నిర్వహించారు.

2కె పరుగు

By

Published : Mar 14, 2019, 11:06 AM IST

Updated : Mar 21, 2019, 9:36 AM IST

2కె పరుగులో పాలొంటున్న కలెక్టర్​, అధికారులు
ములుగు జిల్లా కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ వద్ద జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి జెండా ఊపి 2కె రన్​ను ప్రారంభించారు. ప్రజాస్వామ్యంలో ఓటు ప్రాధాన్యతను వివరిస్తూ నిర్వహించిన పరుగులో రెవెన్యూ, పోలీసు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. వ్యవసాయ మార్కెట్​ నుంచి తెలంగాణ తల్లి విగ్రహం వరకు జరిగిన కార్యక్రమంలో అధికారులతో పాటు విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.
Last Updated : Mar 21, 2019, 9:36 AM IST

ABOUT THE AUTHOR

...view details