కన్న కూతురికి విషం ఇచ్చి తల్లి ఆత్మహత్య చేసుకున్న ఘటన సూర్యాపేట జిల్లాలో చోటు చేసుకుంది. కోదాడలో నివసిస్తున్న ఓ మహిళ చిట్టీల వ్యాపారం నిర్వహించేది. ఆమె దగ్గర డబ్బు తీసుకున్న వారు సకాలంలో చెల్లించకపోవడంతో ఆర్థిక ఇబ్బందుల్లో పడిపోయింది. దిక్కుతోచని స్థితిలో చనిపోవాలని నిర్ణయించుకుంది. కుమార్తె మానసిక దివ్యాంగురాలు కావడంతో... తాను చనిపోతే బిడ్డను చూసేవారు ఎవరూ ఉండరనే ఆలోచనతో కూతురిని సైతం తనతో పాటు చావుకు తోడుగా తీసుకువెళ్లాలనుకుంది. కూతురికి విషమిచ్చి... ఆపై తాను ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడింది.
నేను చనిపోతే నా బిడ్డను చూసేది ఎవరు..? - తల్లి కుమార్తే ఆత్మహత్య
తను చనిపోతే కూతురుని చూసేవారు ఎవరూ లేరని ఓ తల్లి కూతురికి విషమిచ్చి... ఆపై తాను ఆత్మహత్య చేసుకుంది. ఆర్థిక ఇబ్బందుల కారణంగానే ఆమె ఈ నిర్ణయం తీసుకున్నట్లు స్థానికులు తెలిపారు. ఈ విషాద ఘటన సూర్యాపేట జిల్లాలో చోటు చేసుకుంది.
నేను చనిపోతే నా బిడ్డను చూసేది ఎవరూ..?