నీటి సదుపాయం లేక కొన్ని పంట పొలాలు పూర్తిగా బీడు భూములుగా మారడం వల్ల వాటిని తిరిగి సాగులోకి తీసుకురావాలన్న లక్ష్యంతో రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు ఏర్పాటు చేసిన 14 మంది రిటైర్డు ఇంజినీర్లతో కూడిన కమిటీ రాష్ట్రంలో పర్యటిస్తోంది. సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ నియోజకవర్గ పరిధిలో నీటి కొరత అధికంగా ఉండడం వల్ల నియోజకవర్గంలోని వివిధ మండలాలు, గ్రామాల్లో పర్యటించారు.
మేళ్లచెరువు మండలంలోని హెమ్లా తండాలో శుక్రవారం రోజున పర్యటించిన ఇంజినీర్ల కమిటీ ప్రభుత్వానికి నివేదిక అందజేయనుంది. ఈ పర్యటనలో విశ్రాంత ఇంజినీర్లు చంద్రమౌళి, వెంకట రామారావు, అనంత రాములు, సత్తిరెడ్డి జగదీష్‌తో పాటు ఎమ్మెల్యే సైదిరెడ్డి నీటిపారుదల శాఖ అధికారులు పాల్గొన్నారు.
'ప్రతి ఎకరాకు నీరు అందించడమే లక్ష్యం' - latest news of retied engineers commity
బీడు భూములను సాగులోని తేవడమే లక్ష్యంగా ప్రతి ఎకరాకు నీరందించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారని విశ్రాంత నీటిపారుదల ఇంజినీర్లు పేర్కొన్నారు. సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ నియోజకవర్గ పరిధిలోని వివిధ గ్రామాల్లో పర్యటించారు.
'ప్రతి ఎకరాకు నీరు అందించడమే లక్ష్యం'