సూర్యాపేట జిల్లా మునగాల మండలం నేలమర్రి ఇంఛార్జి వీఆర్వో శ్రీనివాస్ ఓ రైతు నుంచి రూ. 17 వేల లంచం తీసుకుంటూ అనిశాకు దొరికాడు. అదే గ్రామానికి చెందిన సోమిరెడ్డి వెంకట్ రెడ్డి తన తల్లి పేరుమీద ఉన్న నాలుగున్నర ఎకరాల భూమిని తన పేరుకు పట్టా పాసు పుస్తకం చేయించాడు.
అనిశా వలలో గ్రామ రెవెన్యూ అధికారి - వీఆర్వో రూ. 17 వేల లంచం అడిగాడు
ఓ రైతు తన తల్లి పేరుమీద ఉన్న భూమిని తన పేరుకు పట్టా పాసు పుస్తకం చేయించినందుకు వీఆర్వో రూ. 17 వేల లంచం అడిగాడు. రైతు అనిశా అధికారులకు తెలిపాడు..చివరకు వీఆర్వో లంచం తీసుకుంటూ దొరికిపోయాడు.
అందుకు వీఆర్వో శ్రీనివాస్ రూ. 17 వేలు లంచం అడిగినట్లు రైతు తెలిపారు. ఏం చేయాలో పాలుపోని స్థితిలో నల్గొండ అవినీతి నిరోధక శాఖకు ఫిర్యాదు చేశాడు. అప్రమత్తమైన అధికారులు పక్కా ప్రణాళికతో పట్టుకున్నారు. వీఆర్వో శ్రీనివాస్‌పై విచారణ పూర్తైన తర్వాత హైదరాబాద్ స్పెషల్ కోర్టుకు తరలిస్తామని అనిశా అధికారి కృష్ణ గౌడ్ వెల్లడించారు. ఎవరైనా అవినీతికి పాల్పడితే టోల్ ఫ్రీ నెంబర్1064కు ఫోన్ చేయాలని సూచించారు.
ఇదీ చూడండి :ఎడ్లబండ్లకు కూడా రేడియం స్టిక్కర్స్ అంటించుకోవాలి..