సూర్యాపేట జిల్లా నడిగూడెంలో ఓ మహిళకు నిన్న కరోనా పాజిటివ్ అని తేలింది. ఆమె ఇంట్లోనే చికిత్స పొందుతోంది. ఈ విషయం తెలిసిన గ్రామస్థులు బాధితురాలిని ప్రభుత్వ ఐసోలేషన్‌కు తరలించాలని తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు.
కరోనా బాధితురాలిని ఐసోలేషన్‌కు తరలించాలని ధర్నా - suryapet news in telugu
హోం ఐసోలేషన్‌లో ఉన్న ఓ కరోనా బాధితురాలిని ప్రభుత్వ ఐసోలేషన్ కేంద్రానికి తరలించాలని సూర్యాపేట జిల్లా నడిగూడెంలో స్థానికులు ఆందోళన చేశారు. తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు.
villagers protest for move corona positive patient to government isolation center
పోలీసు, రెవెన్యూ, వైద్య అధికారులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని గ్రామస్థులకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. పాజిటివ్ మహిళ గ్రామంలో ఉంటే తమకు ప్రమాదమని అధికారులతో వాగ్వాదం చేశారు. ఎలాంటి ఇబ్బంది కలకుండా చుస్తామని పోలీసులు నచ్చజెప్పగా... నిరసనకారులు ధర్నాను విరమించుకున్నారు.