సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ మండలం లింగగిరిలో వాగుపై వంతెన నిర్మాణానికి శంకుస్థాపన చేసి ఏళ్లు గడుస్తున్నాయి. ఇప్పటికీ పనులు పూర్తి కాలేదని గ్రామస్థులు ఆరోపించారు. వరదలకు మట్టిరోడ్డు కొట్టుకుపోయి రాకపోకలకు అంతరాయం కలుగుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులకు ఎన్నిసార్లు విన్నవించినా.. ఫలితం లేదన్నారు. వాగు ఉద్ధృతికి ఏటా దాదాపు పదిరోజులు రాకపోకలకు ఇబ్బంది కలుగుతోందని తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
అసంపూర్తి వంతెనతో గ్రామస్థుల అవస్థలు - incomplete bridge
వాగుపై వంతెన నిర్మాణం పూర్తి కాక.. సూర్యాపేట జిల్లా లింగగిరి గ్రామస్థులు నానా అవస్థలు పడుతున్నారు. వరద ఉద్ధృతికి మట్టిరోడ్డు కొట్టుకుపోయి తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.
అసంపూర్తి వంతెనతో గ్రామస్థుల అవస్థలు