తెలంగాణ

telangana

ETV Bharat / state

'కేసీఆర్‌ హయాంలో రాష్ట్ర ప్రజల తలసరి ఆదాయం రెట్టింపు' - మట్టపల్లి వంతెన ప్రారంభ సభలో మంత్రి వేముల ప్రసంగం

సూర్యాపేట జిల్లాలో నిర్మించిన మట్టపల్లి వంతెనను మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా సభలో ప్రసంగించిన ఆయన.. తెరాస ప్రభుత్వం వచ్చాక తెలంగాణ ప్రజల తలసరి ఆదాయం రెట్టింపయిందని అన్నారు.

vemula prashanth reddy speech in mattapally suryapet district
కేసీఆర్‌ హయాంలో రాష్ట్ర తలసరి ఆదాయం రెట్టింపు: వేముల

By

Published : Oct 28, 2020, 5:04 PM IST

కేసీఆర్ ప్రభుత్వం వచ్చాక రాష్ట్ర ప్రజల తలసరి ఆదాయం రెట్టింపయిందని రహదారులు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ హయాంలో రూ. లక్షా 12 వేలు ఉండే తలసరి ఆదాయం ప్రస్తుతం రూ. 2 లక్షల 28 వేలకు చేరుకుందని తెలిపారు. దేశ ప్రజల తలసరి ఆదాయం కంటే తెలంగాణ ప్రజల ఆదాయం ఎక్కువ అని తెలిపారు. సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం మట్టపల్లి వద్ద కృష్ణా నదిపై నిర్మించిన వంతెనను.. మంత్రి జగదీశ్ రెడ్డితో కలిసి ప్రశాంత్‌ రెడ్డి ప్రారంభించారు.

తెలంగాణ నం.1

కాళేశ్వరం ప్రాజెక్టుతో రాష్ట్ర ముఖచిత్రం మారిపోయిందని వేముల వ్యాఖ్యానించారు. అన్నదాతల కోసం రైతు బంధు, రైతు బీమా, నల్గొండ జిల్లా ప్రజలకు గోదావరి జలాల తరలింపు, 24 గంటల విద్యుత్‌, సంక్షేమ పథకాలు ఇలా రైతులు, పేదల కోసం గత ఆరు సంవత్సరాలుగా తెరాస ప్రభుత్వం చేపడుతోందన్నారు. అభివృద్ధిలో దేశంలోనే తెలంగాణ మొదటి స్థానంలో ఉందని వెల్లడించారు.

హుజూర్‌ నగర్‌ నియోజక వర్గ సమస్యల్ని ఎమ్మెల్యే సైదిరెడ్డి నాయకత్వంలో సీఎం కేసీఆర్‌ పరిష్కరిస్తారని తెలిపారు.

కేసీఆర్‌ హయాంలో రాష్ట్ర తలసరి ఆదాయం రెట్టింపు: వేముల

ఇదీ చదవండి:రైతులను ఆదుకునే ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్‌: హరీశ్‌రావు

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details