తెలంగాణ

telangana

ETV Bharat / state

ఉత్తమ్​ ఎదుటే తెరాస, కాంగ్రెస్​ వర్గీయుల ఘర్షణ - ఉత్తమ్​కుమార్​

సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలం టీక్లా నాయక్​ తండాలో ఉద్రిక్తత నెలకొంది. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్​ ఎదుటే  కాంగ్రెస్​, తెరాస వర్గీయులు ఘర్షణకు దిగారు.

ఉత్తమ్​ ఎదుటే తెరాస, కాంగ్రెస్​ వర్గీయుల ఘర్షణ

By

Published : May 10, 2019, 5:32 PM IST

ఉత్తమ్​ ఎదుటే తెరాస, కాంగ్రెస్​ వర్గీయుల ఘర్షణ

సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలం టీక్లానాయక్​ తండాలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్​కుమార్​రెడ్డి ప్రసంగిస్తుండగా తెరాస కార్యకర్త అభ్యంతరం వ్యక్తం చేశారు. నియోజకవర్గంలో మీరేమి అభివృద్ధి చేశారని నిలదేశారు. ఆగ్రహించిన కాంగ్రెస్​ వర్గీయులు ఘర్షణకు దిగారు. తెరాస, కాంగ్రెస్​ వర్గాలు పరస్పరం రాళ్ల దాడులకు తెగపడ్డారు. ఇరువర్గాలను సముదాయించి ఉత్తమ్​ ప్రసంగం ముగించారు. ఉత్రమ్​ వెళ్లిపోయిన వెంటనే మరోసారి ఉద్రిక్తతలు తలెత్తాయి. కాంగ్రెస్​ ఎంపీటీసీ లకావత్​ రామారావు ఇంటిపై తెరాస వర్గీయులు దాడికి యత్నించారు.

ABOUT THE AUTHOR

...view details