సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ నియోజకవర్గంలోని పాలకీడు, మఠంపల్లి, చింతలపాలెం మండలాల్లో టీపీసీసీ ఉత్తమ్‌కుమార్ రెడ్డి పర్యటించారు. పులిచింతల బ్యాక్ వాటర్ వల్ల ముంపునకు గురైన గ్రామాలను సందర్శించారు. పంట పొలాల్లో ఎంత మేర నష్టం కలిగిందో రైతులను అడిగి తెలుసుకున్నారు. పాలకొల్లు మండలంలో మునిగిపోయిన గ్రామాల్లో దుస్తులు, బియ్యం పంపిణీ చేశారు. మట్టపల్లి లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కృష్ణమ్మ వరదకు మునిగిపోయిన ఆలయం వివరాలపై ఆరా తీశారు. మునిగిపోయిన గ్రామాలకుప్రభుత్వం పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.
హూజూర్‌నగర్‌లో పర్యటించిన టీపీసీసీ చీఫ్ - టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి
హుజూర్నగర్ నియోజకవర్గంలోని పలు మండలాల్లో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి పర్యటించారు. ముంపునకు గురైన గ్రామాలకు ప్రభుత్వం పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.
హూజూర్‌నగర్‌లో పర్యటించిన టీపీసీసీ చీఫ్