తెలంగాణ

telangana

ETV Bharat / state

అంబేడ్కర్​ విగ్రహాన్ని కూల్చిన దుండగులను శిక్షించాలి

సూర్యాపేట జిల్లాలోని  మిరియాల గ్రామంలో అంబేడ్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులను శిక్షించాలని కోరుతూ దళిత సంఘాల నేతలు ధర్నా చేపట్టారు.

అంబేడ్కర్​ విగ్రహాన్ని కూల్చిన దుండగులను శిక్షించాలి

By

Published : Sep 5, 2019, 12:31 PM IST

సూర్యాపేట జిల్లా నూతనకల్ మండలం మిరియాల గ్రామంలో అంబేడ్కర్ విగ్రహాన్ని ధ్వంసం చేసిన దుండగులను శిక్షించాలని కోరుతూ దళిత సంఘాల నేతలు ధర్నా నిర్వహించారు. గత రెండేళ్లుగా గ్రామంలోని దళిత సంఘ నాయకులు చందాలు వేసుకొని అంబేడ్కర్​ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తే..ప్రతిష్టించిన మరుసటి రోజే విగ్రహాన్ని ధ్వంసం చేయడం దారుణమని ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి పాల్వాయి పరశురాములు విచారం వ్యక్తం చేశారు. దుండగులను అరెస్టు చేసే వరకు ధర్నా విరమించేది లేదని ఆయన పేర్కొన్నారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన తుంగతుర్తి సీఐ అయోధ్య నిందితులను శిక్షిస్తామని తెలపడంతో ధర్నా విరమించారు.

అంబేడ్కర్​ విగ్రహాన్ని కూల్చిన దుండగులను శిక్షించాలి

ABOUT THE AUTHOR

...view details