సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ పట్టణం మెయిన్‌రోడ్ డివైడర్ మధ్యలో నాటిన మొక్కలకు రక్షణ కరువైంది. ట్రీ గార్డ్ లేకపోవడం వల్ల రోడ్లమీద తిరుగుతున్న ఆవులు మొక్కలను తినేస్తున్నాయి.
డివైడర్ మధ్యలో మొక్కను తీనేసిన ఆవు - suryapet district latest news today
తెలంగాణ వ్యాప్తంగా హరితహారం కార్యక్రమం పెద్దఎత్తున చేపట్టారు.. కానీ నాటిన మొక్కల రక్షణకు పలు చోట్ల పటిష్ఠ చర్యలు తీసుకోలేకపోయారు. ఈ నేపథ్యంలో సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ పట్టణంలో డివైడర్ మధ్యలో నాటిన మొక్కను ఓ ఆవు తీనేసింది. ఓ వైపు మొక్కలు నాటాలని చెబుతున్నా.. నాటిన మొక్కలను రక్షించాలని స్థానికులు చెబుతున్నారు.
డివైడర్ మధ్యలో మొక్కను తీనేసిన ఆవు
మొక్కలకు రక్షణ కల్పించాలని స్థానికులు కోరుతున్నారు. ఇదే మాదిరిగా రోడ్ల మీద తిరుగుతున్న ఆవుల కోసం గోశాల ఏర్పాటు చేయాలని పలువురు అధికారులకు విజ్ఞప్తి చేశారు.
ఇదీ చూడండి :కష్టాలు తెచ్చిపెట్టిన డ్యాన్సులు.. కానిస్టేబుళ్లపై చర్యలు..
Last Updated : Feb 29, 2020, 10:01 PM IST