సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ నియోజకవర్గం గరిడేపల్లిలో లాక్డౌన్ ఆంక్షలు కఠినంగా అమలు చేస్తున్నారు. అనవసరంగా రోడ్లపైకి వచ్చిన 130 బైకులను పోలీసులు సీజ్ చేశారు.
అకారణంగా బయటకు వచ్చిన 130 బైక్లు సీజ్ - లాక్డౌన్ ఆంక్షలు
లాక్డౌన్ నిబంధనలు అతిక్రమించి తిరిగే వారిపై పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్నారు. కారణం లేకుండా రోడ్లపైకి వచ్చిన సుమారు 130 ద్విచక్రవాహనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బయట తిరిగే మరో ఐదుగురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ పేర్కొన్నారు.
అకారణంగా బయటకు వచ్చిన 130 బైక్లు సీజ్
ఏ కారణం లేకుండా బయట తిరిగే ఐదుగురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. లాక్డౌన్ వేళ ఇళ్లలో నుంచి బయటకు రావొద్దని కోరారు. ఒకవేళ అత్యవసర పరిస్థితుల్లో వచ్చినా భౌతిక దూరాన్ని పాటించాలని విజ్ఞప్తి చేశారు.
ఇదీ చూడండి :చెయ్యి పైకి లేచిందో... అలారం మోగుద్ది