సూర్యాపేట జిల్లా కోదాడలోని బాలుర ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఎదురుగా తెలంగాణ విద్యార్థి వేదిక కార్యకర్తలు ఆందోళన నిర్వహించారు. రెండోసారి అధికారంలోకి వచ్చిన తెరాస ప్రభుత్వం విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేస్తూ... కార్పొరెట్ విద్యా సంస్థలకు కొమ్ముకాస్తోందని ఆరోపించారు. ప్రభుత్వ పాఠశాలలకు, కళాశాలకు కనీస మౌలిక సదుపాయాలు కల్పించడంలేదని మండిపడ్డారు. రేషనలైజేషన్ పేరుతో 3 వేల పాఠశాలను మూసేసేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారని.. అలాంటి నిర్ణయాలు మానుకోవాలని డిమాండ్ చేశారు.
'విద్యా వ్యవస్థను ప్రభుత్వం నిర్వీర్యం చేస్తోంది' - GOVERNMENT
ప్రభుత్వం కార్పొరెట్ సంస్థలకు కొమ్ముకాస్తూ విద్యావ్యవస్థను నిర్వీర్యం చేస్తోందని తెలంగాణ విద్యార్థి వేదిక ఆగ్రహం వ్యక్తం చేసింది. కోదాడలోని ప్రభుత్వ పాఠశాల ముందు ఆందోళన నిర్వహించింది.
TELANGANA VIDYARTHI VEDHIKA PROTESTED AGAINST TRS GOVERNMENT