నాగర్ కర్నూల్ జిల్లా పదర మండల తహసీల్దార్ మల్లికార్జున రావును కలెక్టర్ శ్రీధర్ సస్పెండ్ చేశారు. ఇప్పలపల్లికి చెందిన రైతు నుంచి డబ్బలు తీసుకుంటున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడం వల్ల మల్లికార్జున రావుపై వేటు వేశారు. చిన్న చిన్న సాకులు చెబుతూ రైతుల భూములను ఆన్ లైన్ చేయకుండా పీడిస్తున్నాడని బాధితులు ఆరోపించారు. లంచం ఇవ్వనిదే పనులు చేయడంలేదని తెలిపారు.
రైతువద్ద లంచం.. తహసీల్దార్‌పై సస్పెన్షన్ వేటు - money
భూరికార్డుల ప్రక్షాళన లంచగోండి తహసీల్దార్లకు కల్పవృక్షంలా మారింది. నాగర్ కర్నూల్ జిల్లా పదర మండల తహసీల్దార్ మల్లికార్జున రావును సస్పెండ్ చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. రైతు నుంచి డబ్బు తీసుకుంటున్న వీడియో బటయకు రావడం వల్ల పాలనాధికారి మల్లికార్జున రావుపై వేటు పడింది.
డబ్బు తీసుకుంటున్న తహసీల్దార్