తెలంగాణ

telangana

ETV Bharat / state

అధికారులు దౌర్జన్యం చేస్తున్నారు: చిరు వ్యాపారులు

వారంతా చిరు వ్యాపారులు..రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబాలు. తోపుడు బండ్లే జీవనాధారం..అలాంటి వారిపై దయలేకుండా అధికారులు దౌర్జన్యం చేస్తున్నారు. వారి ఆగడాలను భరించలేక హుజూర్​ నగర్ మున్సిపల్ కార్యాలయం ముందు ఆందోళన చేపట్టారు. నిత్యం వేలాది రూపాయల జరిమానా విధిస్తున్నారని ఆరోపించారు. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.

Street vendors strike
దౌర్జన్యం చేస్తున్న అధికారులను సస్పెండ్ చేయాలని చిరు వ్యాపారులు ఆందోళన

By

Published : Dec 18, 2020, 5:57 PM IST

సూర్యాపేట జిల్లా హుజూర్​ నగర్ మున్సిపాల్టీ పరిధిలో..తమపై దౌర్జన్యం చేస్తున్న అధికారులను సస్పెండ్ చేయాలని చిరు వ్యాపారులు ఆందోళన చేపట్టారు. మున్సిపల్ కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేశారు. ముప్పై ఏళ్లుగా రోడ్ల వెంట తోపుడు బండ్లు పెట్టుకొని జీవనం సాగిస్తున్నామని తెలిపారు.

పోషణ లేక..

రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబాలంటూ ఆవేదన చెందారు. కరోనాతో వ్యాపారాలు నడవక కుటుంబ పోషణ లేక వీధి పాలైనామని అన్నారు. ప్రభుత్వం నుంచి పేదలకు ఎటువంటి ఆర్ధిక సహాయం అందలేదని తెలిపారు. నిత్యవసర ధరలు పెరిగి ఏమి కొనలేని స్థితిలో ఉన్నామని వాపోయారు.

కుటుంబాన్ని పోషించుకోవడం కోసం రోడ్ల వెంట తోపుడు బండ్లు పెట్టుకొని బతుకుతున్నాం. మున్సిపాల్టీ అధికారులు, శానిటరీ ఇన్స్పెక్టర్, కమిషనర్, ఛైర్మన్, వైస్ ఛైర్మన్ వేధిస్తున్నారు. నిత్యం వేలాది రూపాయల జరిమానాల విధిస్తూ మానసిక క్షోభకు గురిచేస్తున్నారు. -చిరు వ్యాపారులు

శ్రుతి మించాయి..

ఆర్ధికంగా వేధిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మున్సిపాల్టీ సిబ్బంది, పాలకుల ఆగడాలు శృతి మించాయని ఆరోపించారు. ఉన్నతాధికారులు స్పందించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకొని తమకు న్యాయం చేయాలని కోరారు.

ఇదీ చూడండి: కరోనాతో కొలువు కోల్పోయి.. అప్పు చెల్లించలేక ఆత్మహత్య

ABOUT THE AUTHOR

...view details