సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండల కేంద్రంలో రాష్ట్రస్థాయి రగ్బీ శిక్షణ కేంద్రాన్ని జిల్లా రగ్బీ అధ్యక్షుడు చక్రధర్ రావు ప్రారంభించారు. వివిధ జిల్లాల నుంచి వచ్చిన క్రీడాకారులకు 11రోజుల పాటు శిక్షణ ఇవ్వనున్నారు. వీరికి అంతర్జాతీయ స్థాయి క్రీడాకారుడు నోయల్ శిక్షణ ఇస్తున్నారు. ఈ క్రీడ మొదట ఇంగ్లాండ్ దేశంలో ప్రారంభమైందని జిల్లా రగ్బీ అధ్యక్షుడు చక్రధరరావు చెప్పారు. వివిధ గ్రామాల నుంచి జాతీయస్థాయిలో పాల్గొని ప్రశంసా పత్రం పొందిన క్రీడాకారులకు అభినందనలు తెలిపారు.
మఠంపల్లిలో రాష్ట్రస్థాయి రగ్బీ శిక్షణా కేంద్రం - national
సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండల కేంద్రంలో రాష్ట్రస్థాయి రగ్బీ శిక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. వివిధ జిల్లాల నుంచి పాల్గొన్న క్రీడాకారులకు అంతర్జాతీయ స్థాయి క్రీడాకారుడు నోయల్ శిక్షణ ఇస్తున్నారు.
మఠంపల్లిలో రాష్ట్రస్థాయి రగ్బీ శిక్షణ కేంద్రం