సూర్యాపేట జిల్లా పాలకవీడులో మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి ప్రచారం చేశారు. ఆర్టీసీ కార్మికుల సమస్యలు పరిష్కరించలేని వ్యక్తి తెలంగాణ ముఖ్యమంత్రి కావడం దురదృష్టకరమన్నారు. తెలంగాణ ఆత్మగౌరవ పోరాటం హుజూర్నగర్ నియోజకవర్గం నుంచే ప్రారంభం కావాలని ఓటర్లకు పిలుపునిచ్చారు. నాటి నిజాం నవాబును గుర్తుచేసేలా కేసీఆర్ పరిపాలిస్తున్నారని ఆరోపించారు. తెలంగాణలో సబ్బండ వర్గాలను మోసం చేస్తూ నిరంకుశ పాలన సాగిస్తున్నారని రేవంత్ రెడ్డి విమర్శించారు.
పోరాటం హుజూర్నగర్ నుంచే మొదలవ్వాలి: రేవంత్ - congress campaign in huzurnagar by elections
తెలంగాణ ఆత్మగౌరవ పోరాటం హుజూర్నగర్ నుంచే ప్రారంభం కావాలని మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి అన్నారు. సూర్యాపేట జిల్లా పాలకవీడులో ప్రచారం చేశారు.
రేవంత్ రెడ్డి