తెలంగాణ

telangana

ETV Bharat / state

నరసింహస్వామి ఆలయ పునరుద్ధరణ పనులకు మోక్షం - నరసింహస్వామి ఆలయ పునరుద్ధరణ పనులకు మోక్షం

నాలుగు వందల సంవత్సరాల చరిత్ర కలిగిన సుప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ యోగానంద లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం పునరుద్ధరణ పనులకు ఎట్టకేలకు గ్రహణం వీడింది. సూర్యాపేట జిల్లా అర్వపల్లి గ్రామంలో నిధుల కొరతతో నిలిచిపోయిన ఆలయపునర్నిర్మాణం త్వరలోనే ప్రారంభం కానుంది.

నరసింహస్వామి ఆలయ పునరుద్ధరణ పనులకు మోక్షం

By

Published : Aug 19, 2019, 7:59 PM IST

నరసింహస్వామి ఆలయ పునరుద్ధరణ పనులకు మోక్షం

సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెం మండలం అర్వపల్లి గ్రామంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ యోగానంద లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయ పునరుద్ధరణ పనులకు గ్రహణం వీడింది. సుమారు నాలుగు వందల సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ ఆలయం శిథిలావస్థకు చేరింది. భక్తుల విరాళాలు, దేవాదాయ శాఖ మంజూరు చేసిన నిధులతో 2013లో పునర్నిర్మాణ పనులు ప్రారంభించారు. గర్భగుడి, మండపం స్లాబ్ నిర్మాణం కొరకు పనులు పూర్తి చేశారు. ఆ తర్వాత నిధుల కొరతతో నిర్మాణ పనులు నిలిచిపోయాయి.
ఆయన సంకల్పంతోనే సాధ్యం

జాజిరెడ్డిగూడెం గ్రామానికి చెందిన దివంగత నీటిపారుదల శాఖ రాష్ట్ర ముఖ్య సలహాదారుడు రామరాజు విద్యాసాగర్ రావు దేవాలయాన్ని అభివృద్ధి చేయాలని సంకల్పించారు .ఈ విషయాన్ని సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లారు స్పందించిన సీఎం ప్రత్యేక నిధుల నుంచి కోటి రూపాయలు మంజూరు చేశారు. వీటికి తోడు సీజీఎఫ్​ నిధులు కూడా మరో 20 లక్షలతో కలిపి గర్భాలయ గోపురం 2 ఉపాలయాలు, రాతి మండపం, విమాన గోపురం, ధ్వజస్తంభం, కోనేరు, ప్రహరి, ఆలయ రథాలయం ఇంటి నిర్మాణ పనులు చేయాల్సి ఉంది. ప్రస్తుతం 1 కోటి 20 లక్షలు ప్రక్రియ పూర్తి చేశారు.

టెండర్​ ప్రక్రియ పూర్తి

ప్రస్తుతం నిధులు మంజూరు కావడం వల్ల దేవాలయం పునర్నిర్మాణ పనులకు టెండర్ ప్రక్రియ పూర్తయింది. ఈ పనులను టెండర్​ ద్వారా నటరాజ సంస్థ దక్కించుకుంది. వారం పది రోజుల్లో పనులు మొదలు పెడతారని గుత్తేదారులను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ నిర్ణీత గడువులో పనులు పూర్తి చేస్తామని ఆలయ ఏఈ రాజయ్య తెలిపారు.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details