సూర్యాపేట జిల్లా కోదాడ మండల పరిధి రైతులతో కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్, జిల్లా జాయింట్ కలెక్టర్ ముఖాముఖి నిర్వహించారు. జిల్లాలో ఉన్న భూ సమస్యలు పదిహేను రోజుల్లో పూర్తిచేస్తామని జాయింట్ కలెక్టర్ హామీ ఇచ్చారు. తహశీల్దార్ పరిధిలో సమస్యలుంటే నేరుగా కలెక్టర్ కార్యాలయానికి వచ్చి దరఖాస్తు చేసుకుంటే సమస్యలు పరిశీలిస్తామని అధికారులు పేర్కొన్నారు.
రైతులతో ఎమ్మెల్యే బొల్లం ముఖాముఖి - జాయింట్ కలెక్టర్
సెంటు భూమి కూడా ఉన్న రైతుకు న్యాయం చేయడం సీఎం కేసీఆర్ వల్లనే అవుతుందని, రాష్ట్రంలో ప్రతి ఒక్క రైతుకు తెరాస అండగా ఉంటుందని కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు.
రైతులతో ఎమ్మెల్యే బొల్లం ముఖాముఖి