తెలంగాణ

telangana

ETV Bharat / state

రోడ్డుపైనే ప్రసవించిన మహిళ

డయల్​ 100 అధికారుల నిర్లక్ష్యం, స్పందించని 108 సిబ్బంది.. ఫలితంగా సూర్యాపేటకు చెందిన ఓ మహిళ అర్ధరాత్రి సమయంలో రోడ్డపక్కనే ప్రసవించింది.

pregnant-delivery-on-road-in-suryapeta
అధికారుల నిర్లక్ష్యం.. రోడ్డుపైనే ప్రసవించిన మహిళ

By

Published : Apr 16, 2020, 3:40 PM IST

సూర్యాపేట జిల్లా అర్వపల్లి మండలం రామన్నగూడెం గ్రామానికి చెందిన రేష్మ మూడో కాన్పు కోసం సూర్యాపేటలోని ఆసుపత్రిలో ప్రతినెల చికిత్స తీసుకుంటోంది. నెలలు నిండిన ఆమెకు ఏప్రిల్​లో డెలివరీ అవుతుందని వైద్యులు చెప్పారు. అయితే నిన్న అర్ధరాత్రి సమయంలో ఆమెకు పురిటి నొప్పులు వచ్చాయి. ఆమె భర్త వెంకన్న డయల్​ 100కు కాల్​చేస్తే స్పందించలేదు.. 108కు ఫోన్​చేస్తే సిబ్బంది ఎవరూ లేరని వారు తెలిపారు.

వెంకన్న తన ద్విచక్రవాహనంపై భార్యను ఎక్కించుకుని ప్రభుత్వ ఆసుపత్రికి పయనమయ్యాడు. మార్గమధ్యంలో రోడ్డుపైనే ఆమె ప్రసవించింది. పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఆమె ప్రసవించిన అరగంటకు పెన్​పహాడ్​​ నుంచి 108 వాహనం వచ్చి తల్లీబిడ్డలను ఆసుపత్రికి తీసుకెళ్లింది. కాగా అత్యవసర సమయాల్లో రావలసిన గైనకాలజిస్ట్​, చిన్నపిల్లల వైద్యులు కూడా ఆసుపత్రికి రాకపోవడం గమనార్హం. విషయం తెలుసుకున్న జిల్లా వైద్యాధికారి, జిల్లా పాలనాధికారి ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు. బాధిత కుటుంబాన్ని పరామర్శించారు.

అధికారుల నిర్లక్ష్యం.. రోడ్డుపైనే ప్రసవించిన మహిళ

ఇవీ చూడండి: లక్ష మంది రోగులకైనా చికిత్స: కేసీఆర్

ABOUT THE AUTHOR

...view details