తెలంగాణ

telangana

ETV Bharat / state

ప్రభుత్వాస్పత్రిలో నిలిచిన విద్యుత్​ సరఫరా

బిల్లులు చెల్లించలేదని ప్రభుత్వ ఆస్పత్రిలో విద్యుత్​ నిలిపివేసిన ఘటన సూర్యాపేట జిల్లా హుజూర్​నగర్​లో జరిగింది. కరెంటు లేక రోగాలు తీవ్ర అవస్థలు పడ్డారు. వెంటనే విద్యుత్​ పునరుద్ధరించాలని కోరారు.

power cut at hospital in huzurnagar
ప్రభుత్వాస్పత్రిలో నిలిచిన విద్యుత్​ సరఫరా

By

Published : Dec 28, 2019, 6:46 PM IST

సూర్యాపేట జిల్లా హుజూర్​నగర్ ప్రభుత్వ వైద్యశాలలో కరెంటు సరఫరా నిలిపివేశారు. గత కొన్ని నెలలుగా ప్రభుత్వ వైద్యశాల బిల్లులు చెల్లించకపోవడం వల్ల విద్యుత్ అధికారులు సరఫరా నిలిపివేశారు. సుమారు రూ.12 లక్షల బకాయిలు ఉన్నట్లు తెలిపారు.

రోగుల తీవ్ర ఇబ్బందులు

ఈ విషయాన్ని ఆస్పత్రి సిబ్బంది ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. విద్యుత్​ లేక డైలసిస్ రోగులు, గర్భిణీ స్త్రీలు, పిల్లలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వెంటనే కరెంటును పునరుద్ధరించాలని కోరారు.

ప్రభుత్వాస్పత్రిలో నిలిచిన విద్యుత్​ సరఫరా

ఇవీ చూడండి: కాంగ్రెస్​ ఆవిర్భావ దినోత్సవం: దేశవ్యాప్తంగా ర్యాలీలు

ABOUT THE AUTHOR

...view details