తెలంగాణ

telangana

ETV Bharat / state

సూర్యాపేటలో పోలింగ్​కు సర్వం సిద్ధం - ఎన్నికల ఏర్పాట్లు

ఎన్నికల్లో పోలింగ్​కు సర్వం సిద్ధమైంది. సూర్యాపేట జిల్లా కోదాడలో కలెక్టర్​ ఆధ్వర్యంలో ఈవీఎంల పంపిణీ జరిగింది. సిబ్బంది సామగ్రితో తమకు కేటాయించిన ప్రాంతాలకు పయనమవుతున్నారు. ఎన్నికలు సజావుగా సాగేలా పోలీసులు భద్రత పర్యవేక్షిస్తున్నారు.

ఎన్నికల ఏర్పాట్లు

By

Published : Apr 10, 2019, 5:34 PM IST

సూర్యాపేట జిల్లా కోదాడలో ఈవీఎంల పంపిణీ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్​ అమోయ్​ కుమార్​ పర్యవేక్షిస్తున్నారు. పోలింగ్​ నిర్వహణకు 286 కేంద్రాల్లో 1260 మంది సిబ్బందిని నియమించారు. భద్రత విధుల కోసం డీఎస్పీ, నలుగురు సీఐలు, 10 మంది ఎస్​ఐలు, 50 మంది కేంద్ర రక్షణ బలగాలు, 150 మంది స్థానిక పోలీసులను కేటాయించారు. ఈవీఎంలో సాంకేతిక సమస్య వస్తే అదనపు ఈవీఎంలను ఏర్పాటు చేసినట్లు కలెక్టర్​ వివరించారు. ఓటర్లు ప్రశాంత వాతావరణలో ఓటు హక్కు వినియోగించుకోవాలని సూచించారు.

ఎన్నికలకు ఏర్పాట్లు

ABOUT THE AUTHOR

...view details