సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మండలం తాటిపాములలో దారి తప్పి నెమలి వచ్చింది. గ్రామంలోని కుక్కలు నెమలిని తరిమాయి. ప్రాణభయంతో నిమ్మల వీరస్వామి ఇంట్లో తల దాచుకుంది. గమనించిన వీరస్వామి గ్రామపంచాయతీ సిబ్బందికి తెలిపాడు. అటవీ అధికారులు అక్కడికి చేరుకున్నారు. బీట్ అధికారి భవానికి గ్రామస్థులు నెమలిని అప్పగించారు.
దారి తప్పిన నెమలి.. తరిమిన కుక్కలు.. చివరికి... - అటవీ అధికారులకు అప్పగింత
గ్రామంలో సంచరిస్తున్న నెమలిని గ్రామపంచాయతీ సిబ్బంది అటవీ అధికారులకు అప్పగించారు. ఈ ఘటన సూర్యాపేట జిల్లాతిరుమలగిరి మండలం తాటిపాములలో చోటుచేసుకుంది.
దారి తప్పిన నెమలిని తరిమిన కుక్కలు