రాష్ట్రంలో త్వరలో జరగనున్న పురపాలక ఎన్నికల్లో వార్డుల విభజన, రిజర్వేషన్ల ప్రక్రియ పారదర్శకంగా చేపట్టాలని టీపీసీసీ అధ్యక్షుడు, ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. వార్డుల విభజన ప్రక్రియ ఇంకా పూర్తి కానందున ఎన్నికల అధికారులు దృష్టి సారించాలని కోరారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో పారిశ్రామికవేత్త మీల సత్యనారాయణ సంతాప కార్యక్రమానికి హాజరయ్యారు. హుజూర్నగర్ ఉపఎన్నికల్లో ఎలాగైనా గెలుపొందాలనే లక్ష్యంతో అధికార పార్టీ కుట్రలు పన్నుతోందని ఆరోపించారు. ప్రభుత్వ విధుల్లో ఉన్న ఉద్యోగిపై దాడి చేస్తే జిల్లా అధికారులు పట్టించుకోలేదని విమర్శించారు. హుజూర్నగర్ ప్రాంతంలో ఇసుక మాఫియా అక్రమాలు, అధికారుల ఉదాశీనతపై డీజీపీ, సీఎస్‌కు ఫిర్యాదు చేయనున్నట్లు వెల్లడించారు.
ఉపఎన్నికలో గెలవడానికి తెరాస కుట్ర: ఉత్తమ్ - mla
త్వరలో జరగబోయే హుజూర్నగర్ ఉపఎన్నికలో గెలవడానికి అధికార పార్టీ కుట్ర పన్నుతోందని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి ఆరోపించారు.
ఉపఎన్నికలో గెలవడానికి కుట్ర