తెలంగాణ

telangana

ETV Bharat / state

మఠంపల్లిలో ఇంట్లో అందరూ ఉండగానే చోరీ.. - మఠంపల్లి మండల కేంద్రంలోని ఓ ఇంట్లో చోరీ

సూర్యాపేట జిల్లా మఠంపల్లిలోని ఓ ఇంట్లో కుటుంబ సభ్యులందరూ నిద్రిస్తుండగానే.. చోరీకి పాల్పడ్డారు గుర్తుతెలియని వ్యక్తులు. ఉదయం లేచి చూసేసరికి ఇంట్లో దాచుకున్న లక్షా 50 వేల రూపాయలు కనిపించకుండా పోయాయి.

one lakh fifty thousand thefted in matampally
మఠంపల్లి మండల కేంద్రంలో లక్షా 50 వేల రూపాయల చోరీ

By

Published : Aug 3, 2020, 1:56 PM IST

సూర్యాపేట జిల్లా మఠంపల్లిలోని ఓ ఇంట్లో ఆదివారం తెల్లవారుజామున చోరీ జరిగింది. శనివారం రాత్రి భోజనాలయ్యాక కుటుంబ సభ్యులంతా పడుకున్నారు. ఉదయం నిద్ర లేచేసరికి తలుపులు తెరిచి ఉండటంతో అనుమానం వచ్చి... ఇళ్లంతా జల్లెడ పెట్టారు. అల్మారాలో ఉన్న బట్టలు కిందపడేసి ఉన్నాయి. అదే అల్మారాలో తాము దాచుకున్న లక్షన్నర రూపాయల నగదు కనిపించకుండా పోయింది. చోరీ జరిగినట్లు గ్రహించిన వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు క్లూస్ టీం సాయంతో ఆధారాలు సేకరించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్​ఐ తెలిపారు. ఇటీవలే పెదవీడులోని ఎరువుల వ్యాపారి ఇంట్లో 30 తులాల బంగారు ఆభరణాలు, లక్ష రూపాయల నగదు అపహరణకు గురైన విషయం మరిచిపోకముందే మండల కేంద్రంలో మళ్లీ దొంగతనం జరగడంతో స్థానికుల్లో భయం నెలకొంది.

ఇవీ చూడండి:రాఖీ స్పెషల్... వీరి అనుబంధం.. దేశానికే రక్ష కావాలి..

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details