సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి కరోనా వైరస్ గురించి ప్రజలకు అవగాహన కల్పించారు. వైరస్ సోకినప్పుడు అది మనిషిలో 14 రోజుల తర్వాత బయట పడుతుందని.. మనం మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటే వైరస్ రాకుండా ఉంటుందని ఆయన స్వీయ వీడియో ద్వారా చెప్పారు. ఒకరికి ఒకరు కరచాలనం ఇవ్వొద్దన్నారు.
'కరోనా ప్రాణాంతకమైన వైరస్ కాదు.. భయపడాల్సిన పనిలేదు' - అవగాహన
కరోనా వైరస్ నివారణ చర్యలపై సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ ఎమ్మెల్యే సైదిరెడ్డి ప్రజలకు అవగాహన కల్పించారు. కోవిడ్-19 మరీ ప్రాణాంతకమైన వైరస్ కాదని.. మన పరిసరాలను శుభ్రంగా ఉంచుకుంటూ వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తే వైరస్ దరిచేరదని ప్రజలకు సూచించారు.
'కరోనా ప్రాణాంతకమైన వైరస్ కాదు.. భయపడాల్సిన పనిలేదు'
చేతులను ఎప్పటికప్పుడు శుభ్రంగా కడుక్కోవాలని ప్రజలకు సూచించారు. కొవిడ్-19 మరీ ప్రాణాంతకమైన వైరస్ కాదని.. దాని గురించి భయపడాల్సిన అవసరం లేదని ఎమ్మెల్యే అన్నారు. ప్రజలను ఈ వ్యాధి నివారణపై చైతన్యవంతులను చేసే విధంగా వివిధ శాఖల అధికారులు అన్ని చర్యలు చేపట్టాలన్నారు.
ఇదీ చూడండి:'కరోనా వచ్చినా భయపడొద్దు.. ఇలా చేస్తే సరి'